ఆ విధంగా మా నరేష్ గాడు హైదరాబాద్ వెళ్ళిపోయి సంవత్సరం అయిపొయింది .ఇక్కడ ఉన్నంత కాలం వీదిలో ఉన్న ఇనప స్తంభాలు బోర్డు లు గట్రా పీకి పందిరి వేసేవాడు .ఏదైనా చూడ ముచ్చటగా ఉంటె నచ్చదు వాడికి .వాడు చేసే ప్రతీ వెధవ పనిని సమర్ధిస్తూ వంశి గాడు ఒకడు .వినయ్ గాడు పెద్దగ ఉండడు కాని ఎంతైనా నరేష్ గాడు,వీడు కలిసి చదువుకున్నారు కదా .. లోపల ఎక్కడో ఉండే ఉంటుంది వీడికి కూడా.
TV9 లో 2012 లో జరగబోయే ప్రమాదాలు ముందుగానే చూసేసిన నరేష్ గాడు ముందు జాగ్రత్తగా వాడి సామాను సర్దేస్కుని , మరచెంబు ,చాప ,కుడి కాలి చెప్పు ,బొత్తాములు ఊడిపోయిన వాడి పుట్టిన రోజు చొక్కా జాగ్రత్తగా సంచిలో పెట్టేస్కుని ,కార్తీక మాసంలో హైదరాబాద్ ఉడాయించాడు.
వంశి గాడు అప్పటికి బ్రతికి ఉంటామో లేదో అన్న భయంతో ముందుగానే ఇంటికి ఫోను చేసి "నాకు సంబదాలు చూడరా మీరు? ఇప్పటికే నా వయసు బోలడంత వచ్చేసింది " అని గదమాయించాడు.వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెంటనే ఇంటికి తాళం పెట్టి వాడికి పిల్లని వెతకటానికి ఊళ్లోకి పరుగెత్తారు.
ఇంతలోపు వినయ్ గాడు పరుగెత్తుకుంటూ వచ్చి ... "ఒరేయ్ వంశి,ప్రసాదు ... త్వరగా ఇల్లు కాళీ చేసి బంనేరుగట్ట అడవుల్లోకి పారిపోదాం పదండి " అంటూ అరిచి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు .
**************** 8 నిమిషాల 6 సెకన్ల తర్వాత ***************
అసలేం జరిగింది ?? అడిగాడు వంశి.
"నేను మా మేనేజర్ ని onsite ఇవ్వలేదని బూతులు తిట్టి resign చేసి వచ్చేసాన్ర " అన్నాడు.
అసలేమైంది ?? అని గట్టిగ అడగ్గానే మొదలు పెట్టాడు వాడు....
అది బుధవారం .. సాయంత్రం సమయం పావు తక్కువ నాలుగుం పావు కావస్తుంది .... వరసగా దోమలను చంపుకుంటూ ఆ విజయోత్సాహాన్ని చూసి మురిసిపోతున్న వినయ్ గాడి ఫోను అప్రయత్నంగా మ్రోగింది.
హలో..ఇక్కడ నేను .. అక్కడ ఎవరు ?
హలో ఇక్కడ కూడా నేనే ..అక్కడ వినయ్ ఉన్నాడా? అని ఒక ఆడ గొంతు కర్కశంగా పలకరించింది .
అదేదో సినిమా లో NTR మూడు సార్లు బొబ్బిలి పులి ,బొబ్బిలి పులి,బొబ్బిలి పులి అని అరిచినట్లుగా వినయ్ గాడు కుడా .. వినయ్ వేగేసిన ,వినయ్ వేగేసిన ,వినయ్ వేగేసిన .వినయ్ అని ముడున్నర్ర సార్లు అరిచి చెప్పండి ఎవరది అన్నాడు.
నేను మేనేజర్ జంబలహాట్ జంబేష్ ని .. ఒకసారి నా రూం కి రా ! అని పెట్టేసాడు.
వెంటనే వినయ్ రెస్ట్ రూం కేసి మౌనంగా నడవసాగాడు .. ఆ మౌనానికి ఆఫీసు లో మిగతా వాళ్ళ నోళ్ళు కూడా మూగబోయాయి.రెస్ట్ రూం లో అద్దంలో చూసుకుని ప్యాంటు జిప్ వేస్కుని ,జేబులోనించి వాటిక హెయిర్ ఆయిల్ తీసి చేతిలో పోస్కుని తలకి రాసి ,చక్కగ దువ్వుకొని, కాటుక,బొట్టు పెట్టుకుని మేనేజర్ రూం కి వెళ్ళాడు .
మేనేజర్ ..రా వినయ్ నీకొక important విషయం చెప్పాలి " అన్నాడు .వెంటనే మళ్లీ NTR లాగా చేతులు కట్టుకుని నిజం చెప్పమన్నారా? అబద్దం చెప్పమన్నారా? మహారాజ అన్నాడు మనవాడు.
అఘోరించావులే కాని నిన్నెవడు ఏమి చెప్పుమనలేదు ఇక్కడ .. వచ్చి కుర్చీలో తగలడు అన్నాడు .
మరేం లేదు వినయ్ .. onsite కి నిన్ను పంపుదామంటే నువ్వింకా సెలెబ్రిటి వె కదా ..నీకన్న legend లు ఉన్నారు ఆఫీసు లో .. అందుకే నిన్ను వచ్చే మాఘ మాసం లో పంపిస్తనే.. అన్నాడు .. ఒక్కసారిగా బయటకి వచ్చి శేషు గాడి చొక్కా పరా పరా చింపేసి.. బోరున ఏడ్చుకుంటూ మళ్లీ రెస్ట్ రూం లోకి వెళ్ళిపోయాడు ...
.
.
.20 నిమిషాలు ... నిశ్శబ్దం ..... ఆఫీసు లో ఏదో కలకలం .. ఎవరో గట్టిగ అరుస్తున్నారు .....
మేనేజర్ రూం లో నించి బయటకు రాగానే బయట శేషు గాడి భుజాల మేదేక్కి కుర్చుని వినయ్ గాడు స్పీచ్ మొదలెట్టాడు.
" గౌరవనీయులైన అందరికి ... వందనాలు .ఇందాక చొక్కా చింపిన శేషు గారడిగారు .. వయసెంత ? అని ..ఇరవై ఆరు ..అన్నాను.. .దగ్గు ,జలుబు, ఆయాసం . సభకు నమస్కారం.రెండున్నర సంవత్సరాల సాఫ్ట్వేర్ జీవితంలో ఒకటిన్నర సంవత్సరం పాటు developer ,సంవత్సరం పాటు watch మాన్ ఒక అంటే నాలుఫు సంవత్సరాల ఈ ప్రాజెక్టు లో రెండు సంవత్సరాల జీవితం నాది. ఎవరూ ఎక్కడ వాడిని ఎలా వచ్చానో చెప్పాలి. ఎన్నో ఆటుపోట్లు. మరణం దగ్గరకు వచ్చి వెళ్ళిన సంధర్భాలూ ఉన్నాయి. క్లుప్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే సాధ్యం కాదు ఎందుకంటే this is the stage to tell who I am, what am I.
ఆకివీడు కి , ఏలూరు కు మధ్యలో ఒక చిన్న ఊరు అక్కడ నుండి నడిచి వెళితే ఒక చిన్న రైల్వే స్టేషన్ , చుట్టూరా తుప్పలు మధ్యలో పల్లెటూరు. నాన్న గారు స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. నా ఇంటర్ మీడియేట్ అవ్వగానే నాన్నగారన్నాను. రేయ్ నువ్వు కూడా స్కూల్ కి రారా ఇద్దరం కలిసి పాటాలు చెప్పుకోవచ్చని . నేను వినలేదు. సరే వేలు విడిచిన మూడవ మామయ్య కి కాలు విగిన నాలగవ పెదన్నన్న సలహా మీద ఇంజినీరింగ్ చదివితే బావుండునని నరసాపురం లో స్వర్ణాంధ్ర లో ఇంజినీరింగ్ చదవటం.అక్కడ మంచి మార్కుల రాక పోవటం వల్ల ఫయనల్ యియర్ లో జేకేసి లో internship రావాటం జరిగింది. ఆ జేకేసి లోనే నరేష్ మిరియాల పరిచయం అవ్వటం,
ఆయన తో పాటు మరికొందరు మిత్రుల సహకారంతో IBM లో కొంతమంది మిత్రులు పరిచయం అవటం జరిగింది.
మనం అనుకుంటాం మన జీవితంలో ఎవ్వరి సహాయం అక్కరలేదూ అను నుకుంటాం కనీసం మనిషికి భూమి సహాయం అన్నా కావాలి నుంచోటానికి.
మొదటి నెల గడిచాక ఇచ్చారు జీతం 332 రూపాయలు .ఇదేవిటండి అని అడిగితే .. బెంచ్ మీద ముప్పొద్దులా తిని తిరిగే వాడికి ఇంతకన్నా ఎక్కువ ఇస్తారనుకున్నావా అన్నారు.కొంత మంది నవ్వారు.. ఎంతో మంది గేలి చేసారు.
ఒక్కరు మాత్రం నా భుజం మీద చెయ్యి వేసి మెచ్చుకున్నారు .. నాకన్నా ఎక్కువ రోజులు బాగానే బెంచి మీద కుర్చున్నవురా అని.. ఆయనే శ్రీ శ్రీ శ్రీ..కొండదాసుల వంశి కృష్ణ గారు. ఆ రోజు నించి అయ్యనే నాకన్ని ... జావా కి సంబారు కి తేడా ఏమిటి,డాట్ నెట్ కి mosquito నెట్ కి సంబంధం ఏంటో అన్ని చెప్పి నన్ను ఒక ఏమి తెలియని మేధావిగా మార్చారు
ఆకరికి ఒకరోజు ఎవరో RDM అంట ..ఆ తల్లెవరో నాకు తెలియదు, నేనెవరో ఆ తల్లికి తెలియదు. ఎన్ని జన్మలెత్తి తీర్చుకోవాలి ఆ తల్లి రుణం. పిలిచి ప్రాజెక్ట్ ఇచ్చారు బెంగలూరు లో ,ఐడి కార్డ్ ,14 దినాల గెస్ట్ హౌస్ వసతి ,ఉచిత భోజనం కూడా ఇచ్చారు.ఆ రోజు నించి మొదలయ్యింది నా సాఫ్ట్వేర్ జీవితం .. ఎన్నో ఒడి దుడుకులు , ఎన్నెన్నో ఆటు పోట్లు .. అన్ని దాటుకుంటూ సాఫ్ట్వేర్ సాగరాన్ని ఈదుకుంటూ ఈ స్టేజి కి వచ్చాను
ఈ రోజు బిల్ గేట్స్ తరవాత జావా లో కోడ్ రాయగలుగుతున్నానంటే that credit goes to the great man, the greatest man, the legend, lengendry, greatest man in ఇండియా, వంశి అన్న పదానికే అర్ధం తీసుకొచ్చిన మనిషి ప్రపం చ సాఫ్ట్వేర్ చరిత్రలో గ్రేట్ మాన్ మా వంశి కృష్ణ చలవే నా మంచికీ చెడ్డకూ.
చివరిగా, మొన్న జంబేష్ గారన్నారు. ఈ సారి onsite కి నిన్ను పంపించటంలేదు. ఎందుకంటే you are not a లెజెండ్, నువ్వు ప్రాజెక్ట్ లో లెజెండ్ వి కాదు. నువ్వో సెలెబ్రిటివీ అన్నారు. సభా ముఖంగా నేను అందరినీ అడగాలనుకుంది ఏంటంటే ? అసలు లెజెండ్ అంటే ఏంటి ? సెలెబ్రిటి అంటే ఏంటి ? అని ఒక మయిల్ రాసి సెలెబ్రిటి
అంటే ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన మూడు సంవత్సరాలకు ఆన్సైట్ కు వెళతారని. సెలెబ్రిటి అయితే ఇన్నేళ్ళు అవుతుందని చెప్పండి.
నేననుకున్నాను మన ప్రాజెక్ట్ లో ఇంతకాలం పనిచేసి కూడా బతికున్నడి నేనొక్కడినే కదా , client నుండి appreciation mail వచ్చింది నాకే, అంది లెజెండ్రికాదా ?
సన్ కంపనీ వాడు ప్రకటించాడు సన్ జావా certified అని ..ఇంకా తీసుకోలా అది లెజెండ్రీ కాదా?
ప్రాజెక్ట్ లో డెవలపర్ గ,టెస్టర్ గా ,సిస్టం ఇంజనీర్ గా,watch మాన్ గా 500 విభిన్న పాత్రలు పోషించా అది లెజెండ్రీ కాదా ?
ఆరు బగ్గులు , 2 ఫిక్సులు ఇచ్చా అది లెజెండరీ కాదా?
మై డియయ్ ఫ్రండ్స్, భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ కి ఉంటామొ లేదో తెలియదు. నిత్యం సన్నిహితో మ్రుత్యువు కర్తవ్యో ధర్మ సంగ్రహ: అన్నారు పెద్దలు. ప్రతీ క్షణం ముత్యువు వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు పోతామొ తెలియదు.
శేషు గారు, లెజెండ్రి కాదా ? చెప్పండీ ? శేషు గారు లెజెండ్రి కాదా ? శేషు గారుని పిలిచారు. రెండు నెలలు స్టాంప్ వేశారు. సౌత్ ఆఫ్రికా పంపారు. కొన్ని వందల సార్లు పంపారు పక్క ప్రాజెక్ట్ వాళ్ళు శేషు గారిని. మరి ఇది న్యాయమా ? మరి రాములమ్మ గారు, నా తల్లి, నా వదిన, రాములమ్మ గారు, క్లైంట్ అవార్డ్ ఇస్తుంటే ఫొటో తీద్దామావద్దా అని ఆలో చిస్తారటండీ ? ఆవిడకు గార్లాండ్ వేద్దామా వద్దా అని అలోచిస్తారతండీ Yes I will ask all these questions because, project is not for one body. ఒక్కరిది కాదు ఈ ప్రాజెక్టు. ఎంతో మంది కష్టపడితేనే ఒక డెలివరీ వెళుతుంది. మన ఈ alex గారు ఫేమస్ బగ్ ఫిక్సర్ ఆయనకిచ్చారండి ఆన్సైట్ చాన్సు ? వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు నరేష్ గాడు. వాడొక డెవలపర్ గా హిట్టూ, టెస్టర్ గా హిట్టూ, పి యల్ గా హిట్టూ, వాడికీ ఇవ్వలేదు ఆన్సైట్ చాన్సు .
ఇలా ఎంతో మందిని చూసి నన్ను ఆన్సైట్ కి పంపలేదని అడుగుతామా ? క్లైంట్ అసిస్సులుండాలి, ప్రాజెక్ట్ కి మంచి పేరు రావలి, పది మందికి సహాయం చెయ్యాలి.. ఈ ఆన్సైట్ చాన్సు నాకు అక్కరలేదూ అనుకున్నాను.
మనేజర్స్ నా మనసులో ఉన్నది చెప్పాను ఏదేమైనా ఈ రోజు నా మార్గానికీ, నా దారికీ, నేను ఇలా
సంకనాకి పోటానికీ కారణం అయిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు తెలియచేసుకుఉంటూ సెలవు తీసుకుంటాను "అని స్పీచ్ ముగించాడు
No comments:
Post a Comment